వైఎస్ బెంగుళూరు పయనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మూడురోజులపాటు బెంగుళూరు వెళుతున్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌నుంచి బయలుదేరి వెళుతున్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన మాత్రమేనని విశ్రాంతి నిమిత్తం వెళుతున్నారని తెలుస్తోంది. మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులను కుమారుడు జగన్ ఉంటున్న బెంగుళూరులో గడపాలని ఆయన నిర్ణయించుకుని ఉండవచ్చు.
సత్యం-మేటాస్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తీవ్ర వత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. మేటాస్ కు దాదాపు 28 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిన విషయంపై కాంగ్రెస్ అధిష్టానవర్గం, ప్రధాన మంత్రికి నివేదికలు అందాయి.












Click it and Unblock the Notifications