కెసీఆర్ కు రేపు రాత్రి విజయశాంతి విందు

రేపు రాత్రి విందుకు విజయశాంతి కెసీఆర్ ను ఆహ్వానించారు. తెలంగాణ శైలి మాంసాహార రుచులతో విజయశాంతి విందు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ విలీనంపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని, సమావేశానంతరం విజయశాంతి విలేఖర్లతో స్పష్టం చేశారు. దీనితో రాములమ్మ టిఆర్‌ఎస్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ప్రత్యేక తెలంగాణ వాణీ వినిపించే అవకాశమున్నది. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఏకమవుతున్న విపక్షాలకు రాములమ్మ చేరిక అదనపు ఆకర్షణ అవుతుందన్న విషయం సుస్పష్టం.












Click it and Unblock the Notifications