టీఆర్ ఎస్ తో పొత్తు ఇంకాసాధ్యమే: విహెచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు, మంత్రి రేణుకాచౌదరి ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాపై కార్యకర్తలు, నేతల మనోభావాలను ఆమెకు వివరించామని చెప్పారు. తెలంగాణాకు అనుకూల నిర్ణయం పార్టీకి లాభదాయకమని అన్నారు. అలాగే తెరాసతో పొత్తుకూడా పార్టీకి లాభమని తాము వివరించామని చెప్పారు. తెలంగాణాపై కాంగ్రెస్ అధిష్టానవర్గం అనుకూల ప్రకటన చేస్తే వారితో పొత్తుకు ఇంకా అవకాశం ఉందని ఆయన అన్నారు.
స్వార్ధ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మారినట్టు కనిపిస్తోందని కేంద్రమంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానవర్గం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications