పవన్ కి విద్యుత్ షాక్ ప్రమాదం

ఇక కరీంనగర్ జిల్లా రెండో రోజు పర్యటనలో పవన్‌కళ్యాణ్ కాంగ్రెస్‌పై తన విమర్శలను కొనసాగించారు. ప్రసంగించిన ప్రతిచోటా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టిన పవన్, నేతల అవినీతిని తప్పుపట్టారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టమని బుధవారం యువతకు పవన్‌కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంచన మాటలతో ముంచుతున్న కాంగ్రెస్ నయాదివాలాకోరు రాజకీయాలకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.
యువతను టార్గెట్‌గా చేసుకుని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ లక్ష్యాలను వివరించారు. తిమ్మాపూర్‌లోని డ్వాక్రా గ్రూపు మహిళలతో సమావేశమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications