పాతబస్తీలో బంద్, ఉద్రిక్తత
హైదరాబాద్: సియాసత్ ఎడిటర్ జావేద్ అలీఖాన్‌పై ఎంఐఎం నేతల దాడిని నిరసిస్తూ ఈరోజు విపక్షాలు పాతబస్తీ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
సియాసత్ దినపత్రిక సంపాదకుడు జాహెద్‌అలీఖాన్‌పై మజ్లిస్ పార్టీ మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది. ప్రత్యక్షదాడులతో అరాచకానికి తెగబడింది. పాతబస్తీ ప్రజల్లో మార్పునకు కారణమవుతూ తమ కోటకు బీటలు వార్చడానికి ప్రయత్నిస్తున్న జాహెద్‌అలీఖాన్‌పై ప్రత్యక్షదాడికి దిగింది. ఈ దాడిలో ఆయన ముఖంపై, కాలిపై, తలపై బలమైన గాయాలయ్యాయి.తీవ్రగాయాలవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారంరాత్రి 10:15 గంటలకు శాలిబండలో ఓ వివాహానికి హాజరై వస్తున్న ఆయనపై మజ్లిస్ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ఓవైసీ, ముంతాజ్‌ఖాన్‌ల నేతృత్వం లో 150 మంది దాడికి దిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నాయి. దాడిలో పాత్రికేయులు అక్తర్‌మెయిన్‌కు తీవ్రగాయాలు కాగా, బషీర్,లాయక్‌లకు స్వల్పగాయాలయ్యాయి.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తానని జాహెద్‌అలీఖాన్ ప్రకటించిన నాటి నుంచి పాతబస్తీలో యుద్ధవాతావరణం నెలకొంది. జాహెద్‌అలీఖాన్ నిర్వహిస్తున్న పలు సమావేశాలు, సభలకు స్పందన పెరిగిపోవడంతో ఎలాగైనా ఆయన్ను నిలువరించడానికి మజ్లిస్ దాడిని ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ సహకారం పుష్కలంగా ఉండటంతో మజ్లిస్ అగడాలకు అంతే లేకుండా పోతోందని టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఎంబీటీ నేతలు మండిపడుతున్నారు. జాహెద్‌అలీఖాన్‌పై ఇదివరకే అఫ్సర్‌ఖాన్ అనుచరురులు మలమూత్రాదులు పడేసి అవమానపర్చిన విషయం విదితమే. ప్రత్యక్ష దాడులకు దిగుతున్న మజ్లిస్‌కు అడ్డుకట్టవేయడానికి రాజకీయాల్లోకి రావడమే ప్రధాన మార్గంగా జాహెద్‌అలీఖాన్ ఎంచుకున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications