గంగాభవానిపై పద్మ 'బాంబు'
హైదరాబాద్: వివిధ పార్టీల మహిళా నాయకుల మధ్య విమర్శలు రసకందాయంలో పడ్డాయి. ఇవి బ్లాక్ మెయిల్ స్ధాయి వరకు వెళ్ళినట్టు కన్పిస్తోంది. పవన్ కల్యాణ్ వైవాహిక జీవితంపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని చేసిన విమర్శలకు ప్రజారాజ్యం అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల్లో సగానికి సగం మంది జీవితాలు ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు తరహాలో ఉన్నాయని ఆమె వ్యంగ్యంగా అన్నారు. అంటే కాంగ్రెస్ నేతల్లో మహిళలైనా, పురుషులైనా సగం మందికి అక్రమ సంబంధాలు ఉన్నాయన్న శ్లేషను పద్మ ప్రయోగించారు.
ఒక ఎమ్మెల్యే ఇద్దరు భార్యల వ్యవహారం అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు ఎవరికి వారు గుమ్మడి కాయ దొంగల్లా భుజాలు తడుముకున్నారని ఆమె గుర్తు చేశారు. గంగాభవాని ఇక ముందు పవన్ కల్యాణ్ పై ఇలా ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతల జీవితాల్లోని చీకటి కోణాలను బయటపెడతామని పద్మ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications