కాళహస్తి: డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ జగన్‌చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ ట్రస్ట్ ఛైర్మన్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి కర్ణాటక రాజధాని బెంగుళూరు శివారు యలహంకలోని ప్రసిద్ధ సుబ్రమణ్యస్వామి ఆలయంలో యాగం చేస్తున్నారు. 48 మంది రుత్విక్కులతో 48 రోజులు ఈ యాగం జరగనుంది. సహస్రనారికేళ గలన యాగం, శీతచండీహోమం, మహారుద్రయాగం తదితర హోమాలు, యాగాలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, మళ్లీ రాజశేఖర్‌రెడ్డే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని వాంఛిస్తూ యాగం నిర్వహిస్తున్నట్లు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.