• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిరు పార్టీ ఎయిడ్స్ రోగి: టిడిపి

By Staff
|

Chiranjeevi
హైదరాబాద్‌: సినిమా రంగంలో చిరంజీవికి మంచిపేరే ఉన్నా... రాజకీయాల్లో మాత్రం ఆయన పరిస్థితి ఎయిడ్స్‌ రోగిలా తయారయ్యిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. రాజకీయ రంగంలో ఆయన పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందని పేర్కొంది. చిరంజీవి రక్తనిధి కోసం తాము స్థలమిస్తే, ఇప్పుడు ఆ నిధినుంచి రక్తాన్ని అమ్ముకుంటున్నారని, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారని దుయ్యబట్టింది. ప్రరాపాలో చేరేవారిని, టికెట్‌ ఆశించేవారిని ఎంతిస్తావ్‌? అంటూ అల్లు అరవింద్‌ నేరుగా అడుగుతున్నారని ధ్వజమెత్తింది. ఈ మాటలన్నీ ప్రజలు అనుకుంటున్నవేనంటూ విమర్శలు గుప్పించింది. తెదేపా సీనియర్‌ నేతలు కోడెల శివప్రసాద్‌, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.

చిరంజీవి మనసుకు ముఖ్యమంత్రి అనే దెయ్యం పట్టిందని, అందుకే అవాకులు, చవాకులు పేలుతూ సినీ ఫక్కీలో నాటకాలు ఆడుతున్నారని తెదేపా నేతలు దుయ్యబట్టారు. భావదారిద్య్రంతో ఉన్న చిరంజీవికి ఏ విషయంపైనా స్పష్టతలేని, ప్రతి మాటకు అధ్యయనం అంటుంటారని ఎద్దేవా చేశారు. 'మాట్లాడితే చిరంజీవి తనను తాను ఎన్టీఆర్‌తో పోల్చుకుంటున్నారు. కానీ ఆయనకు-ఈయనకు నక్కకూ నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది' అని కోడెల విమర్శించారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంకు నుంచి ఒక్కో యూనిట్‌ రక్తం రూ.1350కు అమ్ముతున్నారని విమర్శించారు. అసలు రక్తం ఇచ్చేవారికి ఇస్తున్న డబ్బులెన్ని?

తమ దగ్గర్నుంచి తీసుకుంటున్నవారి నుంచి వసూలు చేస్తున్నదెంత? అన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు డైరీని మూసివేయించారని మాట్లాడుతున్న చిరంజీవికి... ఈ ఐదేళ్లలో ఆ డైరీ గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయలేదన్న సంగతి తెలియదేమోనని దుయ్యబట్టారు. ఆ డైరీ ఉద్యోగులు నిరాహారదీక్షలు చేస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్లుగా స్పందించలేదని అన్నారు. కుప్పంలో అభివృద్ధి జరగలేదని చిరంజీవి అనడం ఆయన అజ్ఞానం తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.

కుప్పం నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉండేదని, కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఉండేదని, అలాంటిది ఇప్పుడు 70వేల ఎకరాలకు సాగునీటి వసతి ఉందని పేర్కొన్నారు.బీసీలకేదో చేస్తామంటున్న చిరంజీవి అసలు బీసీ కాదు... ఆయనో ఉన్నత వర్గానికి చెందినవాడు అని అరవిందకుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. తెదేపా బీసీల ఛాంపియన్‌ అని ఉద్ఘాటించారు. ప్రరాపా నాలుగు స్తంభాలపై నడుస్తోందన్నారు. చిరంజీవి అధ్యయనం పేరుతో... అల్లు అరవింద్‌ డబ్బు వసూలు చేస్తూ... బజారున పడి తిడుతూ పవన్‌కళ్యాణ్‌... అన్నీ చేసేస్తాం అంటూ నాగబాబు పార్టీని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X