మద్యం వ్యాపారికి టీటీడీ చైర్మన్ పదవా?
హైదరాబాద్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో యోగా తరగతులు నిర్వహిస్తున్న ఆయన ఈరోజు శిక్షణలో సమాజం తీరుపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం రాగానే మధ్య అనేదే ఉండకూడదని మహాత్మాగాంధీ భావించారని అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలే మద్యం అమ్ముతున్నాయన్నారు. ధార్మికసంస్థ అయిన టీటీడీకి ఛైర్మన్‌గా మద్యం వ్యాపారి ఆదికేశవులునాయుడును ప్రభుత్వం నియమించటం సిగ్గుచేటన్నారు. ప్రజలను చంపే మద్యాన్ని అమ్మే వ్యక్తికి దైవ సన్నిధిలో ఉన్నతస్థానం కల్పించటం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications