తొడ గొట్టి చెబుతున్నా..బాలయ్య

ప్రజలు ఇప్పటికే స్థిర నిశ్చయానికి వచ్చారు. 'యువ గర్జన' సభ పెడితే ప్రజలు ఎలా తరలొచ్చారో రాష్ట్రమంతా చూసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేసింది. సామాజిక న్యాయాన్ని అందించింది. హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా మార్చి రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది అంటూ తెలుగుదేశం గురించి చెప్పుకొచ్చారు.
అలాగే చిరంజీవి ప్రజారాజ్యం గురించి మాట్లాడుతూ...ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చి సామాజిక న్యాయమంటే జనాలు నమ్మబోరు. పాతికేళ్ళ క్రితం పార్టీ ఆవిర్భావ సమయంలోనే తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. ఎన్టీ రామారావు టీడీపీని బీసీల పార్టీగా రూపుదిద్దారు. దానిని ఒక విధానంగా పార్టీ ఇప్పటికీ పాటిస్తోంది. సామాజిక న్యాయాన్ని అందించే సత్తా మాకే ఉంది. బడుగు బలహీన వర్గాలకు అవకాశాలను అందించి చేతల్లో చూపించిన చరిత్ర మాది అన్నారు.
ఎన్టీఆర్‌ను నటుని కన్నా మంచి సంఘసంస్కర్తగా ప్రపంచం గుర్తించింది. ఆంధ్రుల ఆత్మాభిమానం మళ్లీ ఢిల్లీ నేతల ముందు మోకరిల్లింది. ఈ విషయాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 1983 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయి' అని బాలకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications