హైదరాబాద్: సత్యం కుంభకోణం వ్యవహారంపై వస్తున్న విమర్శలు తిప్పికొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెడీ అయ్యారు. ఈ విషయంపై సీబీఐ దర్యాప్తుకు తాము సుముఖమేనని ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. సత్యం కుంభకోణం జరిగిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని ఆ లేఖలో రాసినట్లు సమాచారం. అలాగే సెబీ దర్యాప్తుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందన్న విమర్శలను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అవసరమైతే సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓ వంటి సంస్థలతో కలిసి ఒక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ఆర్థిక శాఖను కోరారు.