వైయస్ కు కౌంట్ డౌన్: బాబు
హైదరాబాద్: మహాకూటమితో కాంగ్రెస్ ఓటమి ఖాయమని తెలుగుదేశం పార్టీఅధినేత చంద్రబాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన 1000మంది అగర్వాల్ వర్గీయులు చంద్రబాబు సమక్షంలో ఆదివారం తెలుగుదేశంలో చేరారు. సత్యం కుంభకోణంతో ఆంధ్రప్రదేశ్ వ్యాపారుల్ని ఎవరూ నమ్మలేని పరిస్థితిని వై.ఎస్. కల్పించారని ఆయన అన్నారు. ఇప్పటికే వై.ఎస్. ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేశారని మరోసారి ఆయనకు అధికారమిస్తే సామాన్య ప్రజల ఇళ్లను కూడా మిగలనివ్వరంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆయన అన్నారు. సత్యం కుంభకోణంతో రాష్ట్రం పరువు పోయిందని ఆయన అన్నారు. వైయస్ ప్రభుత్వంలో గుండాలు, రాజకీయ నాయకులు లాభపడ్డారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications