కెసిఆర్ కిదేం బుద్ధి?: చిరంజీవి

టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని గతంలో టిడిపి విమర్శించారని, కేసీఆర్‌ది దొరల మనస్తత్వమని తెలుగుదేశం విమర్శించిందని, ఇప్పుడు అన్నీ మరచి ఒక్కటవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా ఒక్కటైన మహాకూటమి ఎంత బలంగా ఉంటుందో చెప్పలేమన్నారు. సిద్ధాంతాలు లేకుండా కేవలం రాజకీయ ఎత్తుగడలతో పొత్తులు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజల అభీష్టానికి అనుకూలంగా ఉండే పార్టీ అని చెప్పారు. కొయ్యగుర్రం మీద కూర్చుని ముందుకూ వెనక్కూ ఊగుతూ ముందుకెళ్తున్నామని మహాకూటమి భావిస్తోందని చిరంజీవి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications