కెసిఆర్ వల్ల తెలంగాణకు నష్టమే: కెకె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వాదానికి నష్టం కలుగజేస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి కె.కేశవరావు వ్యాఖ్యానించారు. తెలిసి తెలిసి కేసీఆర్ తప్పు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస తమతో కలిస్తే కాంగ్రెస్‌కు ఎదురే ఉండేది కాదనీ, ఇప్పుడు మాత్రం కొంత పోటీ తప్పదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బలం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెరాస తెలుగుదేశంతో పోవడం వల్ల కాంగ్రెస్ కు నష్టం ఉండదని ఆయన అన్నారు. అయితే పోటీ మాత్రం ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications