ఎయిమ్స్ నుంచి ప్రధాని డిశ్చార్జీ
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం ఉదయం ఎయిమ్స్ నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఈ నెల 24న జరిగిన కరోనరీ బైపాస్ సర్జరీ తర్వాత వేగంగా కోలుకున్న ప్రధానికి ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు శనివారం అన్ని వైద్య పరీక్షలు జరిపి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిమ్స్ నుంచి డిశ్ఛార్జికి వారు సిఫారసు చేశారు. ప్రధాని పూర్తిగా కోలుకున్నారనీ, చిన్నచిన్న వ్యాయామాలు కూడా చేస్తున్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు తెలిపారు. గత నెల 24వ తేదీన ఆయన ఎయిమ్స్ లో చేరారు.












Click it and Unblock the Notifications