కాంగ్రెస్ పారిపోయింది: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. మహా కూటమిని చూసి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పారిపోయిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మహాకూటమికి పోలవరం ప్రాజెక్టుపై స్పష్టమైన విధానం ఉందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్మానం చేస్తానని తాను అన్నానని, అయితే పోలవరం ప్రాజెక్టు పనులే ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. పోలవరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగం పేలవంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో విధానం లేదని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలా ఉందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో శాంతిభద్రతలను, అవినీతిని, అభివృద్ధిని ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే భయంతో ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నామమాత్రం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావనకు రాకుండా ప్రభుత్వం అడ్డు పడుతోందని ఆయన అన్నారు. బిఎసి సమావేశం మొక్కుబడిగా సాగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి నిస్సహాయుడని ఆయన వ్యాఖ్యానించారు.

మరో శాసనమండలి సభ్యుడిని గెలిచే బలం ఉన్నా కాంగ్రెస్ ఆ సీటును తమకే వదిలిపెట్టిందని ఆయన అన్నారు. పోటీ చేసే సత్తాను కాంగ్రెస్ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అభ్యర్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే దుస్థితిలో కాంగ్రెస్ పడిందని ఆయన అన్నారు. పాత సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త పనులకు ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తోందని, కమీషన్ల కోసమే ఈ పని చేస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+