యాసిడ్ లీక్: పాతబస్తీలో ఒకరు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో యాసిడ్ లీకై ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో 20 మంది ఆస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన యాసిడ్ బ్యారెళ్లను పాతబస్తీలోని బేగంబజార్ లో గల గోడౌన్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి.
గుజరాత్ నుంచి ఐదు బ్యారెళ్ల యాసిడ్ ను పాతబస్తీలోని గోడౌనుకు తరలించే ప్రయత్నం చేస్తుండగా ఒక టిన్ లీకయిందని, దీంతో ఆ ప్రాంతంలోని హైదర్ అలీ అనే రిక్షా కార్మికుడు మరణించాడని పోలీసులు చెప్పారు. ఈ బ్యారెళ్లను గోడౌన్ నుంచి నల్లగొండ జిల్లాలోని బొమ్మల రామారం గల హెర్మిట్ కెమికల్ కర్మాగారానికి తరలించాల్సి ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications