అసెంబ్లీకి విపక్షాల పాదయాత్ర
హైదరాబాద్: ప్రభుత్వ విధానాలకు, అవినీతికి నిరసనగా విపక్షాలు సోమవారం అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించాయి. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరనుంచి అసెంబ్లీ వరకు టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వామపక్షాల నేతలు నోముల నర్సింహయ్య, చాడ వెంకటరెడ్డి, తెరాస నేత ఈటెల రాజేందర్ తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వం అవినీతిలో పీకల దాకా కూరుకుపోయిందని ప్రతిపక్షాల నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీన ప్రభుత్వం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. 12వ శాసనసభ చివరి సమావేశాలు ఇవే కావడం విశేషం.












Click it and Unblock the Notifications