హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పతనం తప్పదు: పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సన్ సిటీ భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు హైదరాబాద్ సమీపంలోని ఉప్పల్ వద్ద రైతులు చేస్తున్న ధర్నాను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. తలకు రుమాలు చుట్టుకుని, భుజంపై కండువా వేసుకుని ఆయన ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం అన్యాయమని ఆయన అన్నారు.

రైతులకు ప్రజారాజ్యం పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తమకు న్యాయం చేయని ప్యాకేజీని రైతులు స్వీకరించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులను వీధుల్లోకి నెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రైతును కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెసుకు పతనం తప్పదని ఆయన అన్నారు. రైతు రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులనే దోపిడీ చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి రైతులు చరమగీతం పాడుతారని ఆయన అన్నారు. రైతులకు తగిన ప్యాకేజీ ప్రకటించే వరకు తమ మద్దతు ఉంటుందని నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. రైతులు తమ పొలాలను విడిచిపెట్టవద్దని, మరో మూడు నెలల్లో కాంగ్రెసు ప్రభుత్వం పతనమవుతుందని, అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X