ఆంధ్రజ్యోతిపై యూత్‌కాంగ్రెస్ దాడి
తిరుపతి: తిరుపతి ఆంధ్రజ్యోతి కార్యాలయంపై శనివారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి అద్దాలు పగుల గొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మరోపక్క కడప జిల్లా కేంద్రంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకుని ధర్నా నిర్వహిస్తున్నారు.
'సాక్షి' భూతం పేరుతో కాంగ్రెస్ పార్టీపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక వార్తలు రాసినందుకుశనివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ ధ్వంసం చేసారు. కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.












Click it and Unblock the Notifications