వైయస్ విద్యుత్ డ్రామాలు: రాఘవులు
హైదరాబాద్ : విద్యత్ చార్జీలను పెంచే యోచనను విరమించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదంటూనే ప్రభుత్వం మరో వైపు వాటిని పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విద్యుత్ రంగానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి లేఖ రాశారు. సామాన్య, మధ్య తరగతి వినియోగదారుల నుంచి డెవలప్‌మెంట్ చార్జీలను వసూలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నిర్వహించుకుంటున్న ఎత్తిపోతల పథకం కింద యూనిట్‌కు చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications