తెరాస ఆఫీసులో యాగశాల దగ్ధం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పార్టీ నిర్వహిస్తోన్న విశ్వశాంతి యజ్ఞం కోసం నిర్మించిన యాగశాల దగ్ధం అయింది. సమీపంలోనే నీటి సౌకర్యం ఉండడంతో పైపులైన్లతో నీరు చల్లి మంటలను ఆర్పగలిగారు. నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థి దిలీప్ కుమార్ విజయం సాధించిన ఉత్సాహంతో తెరాస పార్టీ కార్యకర్తలు బాణసంచాలు కాల్చారు. తారాజువ్వలు కాల్చారు. దీంతో యాగశాలకు నిప్పు అంటుకున్నట్లు అనుమానిస్తున్నారు. తెరాస నాయకులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యాగశాల మొత్తం దగ్ధమైంది. యాగం నిర్వహిస్తున్న వేద పండితులు ఆందోళనతో బయటకు వస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేదీ సంభవించలేదు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ భవన్ లో ఉన్నారు. సంప్రోక్షణ చేసి యాగాన్ని రేపు (మంగళవారం)కొనసాగిస్తామని చెబుతున్నారు. సోమవారం రాత్రి జరగాల్సిన మహా శాంతి యజ్ఞాన్ని ఆపేయాలని అనుకుంటున్నారు. ఇందుకు రేపటి లోగా యాగశాలను తిరిగి నిర్మించే ఆలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications