పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
వరంగల్: వరంగల్ సమీపంలోని జనగాం వద్ద సికింద్రాబాద్-కాజీపేట గూడ్సు రైలు పట్టాలు సోమవారం ఉదయం తప్పింది. దీంతో వరంగల్‌నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు సోమవారం ఉదయం అంతరాయం ఏర్పడింది.ట్యాంకర్లు పక్కకు పడిపోవటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా, తెలంగాణా ఎక్స్‌ప్రెస్‌లు సోమవారం రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. చార్మినార్, కాకతీయ, పుష్‌పుల్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈస్ట్‌కోస్ట్, ఏపీ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించారు. ట్రాక్ ను పునరుద్ధరించిన తర్వాత రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగుతాయి. ప్రస్తుతం ట్రాక్ ను పునరుద్ధరిస్తున్నారు.












Click it and Unblock the Notifications