కేంద్రానికి సీబీఐ వంత: సుప్రీం
న్యూఢిల్లీ: స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ అయిన సీబీఐ కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ వారి ఆదేశాలమేరకు పనిచేస్తోందని సుప్రీంకోర్టు విమర్శించింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై విచారణ జరిపిన సీబీఐ నివేదికను కోర్టుకు అప్పగించే విషయంలో సిబిఐ కేంద్రం సలహా కోరటం సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమైంది. జస్టిస్ అల్తమాస్ కబీర్, జస్టిస్ క్రయాక్ జోసెఫ్‌ల ధర్మాసనం ఈరోజు ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పని కేంద్రానికి వంత పాడటం సరి కాదని హితవు పలికింది.
ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేష్, ప్రతీక్, కోడలు డింపుల్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications