వైయస్ కుమారుడి తిరుగు టపా: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: అమెరికాకు చదువు కోసం పంపిస్తే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు టపాలో వచ్చారని, తన కుమారుడు లోకేష్ అలా రాలేదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. లోకేష్ చదువుకు పెట్టిన డబ్బులపై అధికార పక్షం మంగళవారం మరోసారి ప్రస్తావించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికాలో చదువు కోసం తన కుమారుడు ఒక్కరే వెళ్లలేదని, చాలా మంది వెళ్లారని, అధికార పక్షం వారి పిల్లలు కూడా వెళ్లారని, కొంత మంది పని చేస్తూ చదువుకుంటున్నారని, కొందరు ఉపకార వేతనాల మీద చదువుకుంటున్నారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు.

తన కుమారుడిని చదివించుకునే స్థోమత తనకు లేదా అని అడిగారు. సాక్షి పత్రిక బండారం బయట పడిందనే ఉద్దేశంతోనే హెరిటేజ్ పై అధికార పక్షం రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. తన కుమారుడు ఆమెరికాలో కష్టపడి చదువుకున్నాడని, అందుకు తాను గర్విస్తున్నానని, కొంత అధికార పక్షానికి చెందినవారి పిల్లలు బజార్లో తిరుగుతున్నారని, కొంత మంది పిల్లలు అమెరికా వెళ్లి తిరుగుటపాలో వచ్చారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద సిట్టింగ్ న్యాయమూర్తి విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద తన కుమారుడు చదువుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఎదురుదాడికి తాను భయపడేది లేదని ఆయన అన్నారు.

చంద్రబాబు కుమారుడి చదువు విషయంలో ఆరోపణలు ఉంటే నాలుగున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం ఏం చేస్తోందని, చర్యలు ఎందుకు చేపట్టలేదని అంతకు ముందు సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+