చిరు రోడ్ షోలో ఇద్దరు మృతి
గుంటూరు: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గుంటూరు రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఇద్దరు అభిమానులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిరంజీవి రోడ్ షోలో రెండు బైకులు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులు చక్రాయపాలెం గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. చిరంజీవి సోమవారం నుంచి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications