సత్యం పాపం బాబుదే: వైయస్

సత్యం వ్యవహారంలో తాము చేయగలిగిందంతా చేస్తున్నామని, తమకు ఎలాంటి ప్రత్యేక ఆసక్తులు లేవని రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలు జరిగినట్లు తెలియగానే రామలింగరాజును అరెస్టు చేశామని, ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని అన్నారు. అరెస్టు చేసిన 24 గంటల్లో ఆయనను కోర్టులో హాజరుపరిచామని ఆ తరువాత ఆయన తమ అదుపులో ఎలా ఉంటారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే టీడీపీవారే గతంలో సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారని ఇప్పుడెలా విచారణ అడుగుతున్నారని ప్రశ్నించారు. తాము మాత్రం చిత్తశుద్ధితో ఆ కంపెనీని నిలబెట్టేందుకు, ఉద్యోగులను ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు కేవలం తమపై బురదజల్లటమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.
చంద్రబాబు ఆఖరుకు పిల్లలను సైతం వదలలేదని ఇదేం పద్ధతని అన్నారు. అమెరికాలో రామలింగరాజు కుమారుడు, ఆయన కుమారుడు ఒకే గదిలో ఉన్నారని అన్నారు. అందుకు బాబు అభ్యంతరం చెబుతూ వారు కలిసి ఒకే చోట చదివారు తప్ప ఒకే గదిలో ఉండలేదని అన్నారు. తాము రామలింగరాజును క్లింటన్ పక్కన కూర్చునే స్థాయిలో ఉంచితే మీరు జైల్లో పెట్టారని ఆయనను ఆత్యాశకు గురిచేసి ఆ పరిస్థితి కల్పించారని ఎద్దేవా చేశారు. బుష్‌ను ప్రపంచమంతా అసహ్యించుకుందని ఆయనలాగా నీకూ ఓటమి ఖాయమని వైఎస్‌ను అన్నారు. అందుకు వై.ఎస్ సమాధానం ఇస్తూ తనకు బాబుకున్నంత రాజకీయ పరిజ్ఞానం లేదని అయితే గత ఎన్నికల్లో ఆయన పోటీచేయలేదని, రెండుసార్లకు మించి అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశం లేదనుకుంటానని మరి ఆయన ఎన్నికల్లో ఎలా ఓడిపోయారని వ్యంగ్యాస్త్రం సంధించారు.












Click it and Unblock the Notifications