సత్యంపై ప్రధానికి వైయస్ లేఖ

YS Rajasekhar Reddy
హైదరాబాద్: సత్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. సత్యం, మేటాస్ వ్యవహారం సోమవారం శాసనసభను కుదేపిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ లేఖ రాశారు. చర్చకు శాసనసభలో సమాధానం ఇవ్వడానికి ముందే ఆయన ప్రధానికి ముఖ్యమంత్రి రెండోసారి లేఖరాశారు. సీబీఐ దర్యాప్తుపై నిర్ణయం తీసుకోవాలని అందులో కోరారు. వీలైనంత త్వరగా దీన్ని పరిశీలించి, సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. ఈ వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే సీబీసీఐడీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 60 దేశాల్లో సత్యం కంపెనీ వ్యవహారాలు కొనసాగుతున్నాయన్నారు.

రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేరుతో 300కు పైగా కంపెనీలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. సత్యం కుంభకోణానికి సంబంధించి పలు వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెబీ, ఆదాయపన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆర్వోసీ, కంపెనీ వ్యవహారాలశాఖ, ఎస్‌ఎఫ్‌ఐఓ తదితర సంస్థలతో ముడిపడిఉన్నాయని తెలిపారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌, విదేశీ వ్యవహారాలకు సంబంధించినదైనందువల్ల దీనిపై సీబీఐ విచారణ జరిపితే సమంజసంగా ఉంటుందని సూచించారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం, సీబీసీఐడీ సహకరిస్తాయని చెప్పారు. సత్యం వ్యవహారంపై సీబీఐ విచారణ కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే గత నెల 28వ తేదీన ప్రధానికి ఒక లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+