జగన్ సంస్థలపై చర్చకు పట్టు

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి వై.ఎస్ కుమారుడు జగన్ వ్యాపారసంస్థల కుంభకోణంపై ప్రత్యక్షపోరాటాలకు సిద్ధమవుతున్నట్లు మహాకూటమి నేతలు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ చర్చ లేవనెత్తినా ప్రభుత్వం ఎదరుదాడికి దిగటంతో ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్లి ఆందోళన చేయాలని వారు నిర్ణయించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో వామపక్షాల నేతలు రాఘవులు, నారాయణ, తెరాస అధినేత కేసీఆర్ బుధవారం సాయంత్రం సమావేశమై దీనిపై చర్చించారు.
ఇది అంతర్జాతీయ స్థాయి కుంభకోణమని వారు వ్యాఖ్యానించారు. దీనిపై ఈనెల 13 న గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, ఆరోజునుంచి 16 వరకు నియోజకవర్గస్థాయినుంచి జాతీయస్థాయి వరకు ఆందోళనలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. వాల్‌స్ట్రీట్ కుంభకోణం దీనిముందు దిగదుడుపేనని సీసీఎం కార్యదర్శి రాఘవులు అన్నారు. రాష్ట్రంలో కుంభకోణాలన్నీ వై.ఎస్ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయని అన్నారు. ఇది గిన్నీస్‌బుక్‌లో చోటుచేసుకోదగిన కుంభకోణమని సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications