హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్, ఆర్థిక మంత్రి రోశయ్యలు ఆంధ్రజ్యోతి ఎండీపై తరచుగా చేసే ఆరోపణలపై ఆ దినపత్రిలో రాధాకృష్ణ తను ఎదిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. 1984లో రోశయ్య మంత్రి కాదని, తాను విలేకరిగా పని చేస్తున్నప్పుడు వినియోగించిన వాహనం డొక్కు సైకిల్ కాదని, టివిఎస్ మోపెడని పేర్కొన్నారు. అయితే ఈ కథనంపై మంత్రి రోశయ్య ఒక ప్రైవేట్ టీవీ చానల్ లో న్స్పందించారు. ఆ కాలంలో తాను మంత్రినని ఎప్పుడూ చెప్పలేదని, అపోజిషన్ లీడర్‌గా ఉన్నప్పుడు జూబ్లీహాల్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో, ఆయన చేతులు కడుక్కున్న మాట వాస్తవమేనని రోశయ్య స్పష్టం చేశారు.