న్యూఢిల్లీ: రాజకీయ సన్యాసం తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ నిర్ణయించుకున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదని ఆయన గురువారం ఇక్కడ వెల్లడించారు.తనకు క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగే సమయం ఆసన్నమైనట్లు ఆయన తెలిపారు. ఏదైనా రాజకీయ పార్టీ టిక్కెట్ ఆఫర్ చేస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు సోమనాధ్ సమాధానం చెబుతూ 'ఇక నేను రాజకీయాల నుంచి రిటైర్ కావాలి...సన్యాసం....సన్యాసం తీసుకోవాలి' అన్నారు.