పరదేసంలో మరో తెలుగు విద్యార్ధి దుర్మరణం
నిజామాబాద్: ఉన్నత విద్య కోసం విదేశానికి వెళ్లిన మరో విద్యార్థి అసువులు బాశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సిద్ధార్థ స్పెయిన్‌లో మృతిచెందాడు. నగరంలోని ఖలీల్‌వాడి ప్రాంతానికి వైద్యులు సాంబశివరావు, సుజాతల రెండో కుమారుడైన ఇతను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ ప్రాంతంలో తాను నివసిస్తున్న గదిలో గురువారం మృతి చెందాడు. మృతిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. జర్మనీలో అంతరిక్ష పరిశోధనలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న సిద్ధార్థ రెండు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం స్పెయిన్ వెళ్లాడు. స్పెయిన్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.












Click it and Unblock the Notifications