ప్రేమికులపై కళ్లు: వారికి సంకెళ్ళు
భోపాల్: నగరమంతా తిరుగుతూ వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రేమికులకు ఇబ్బందులు కలిగిస్తున్న 46 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 35 మంది శివసైనికులు కాగా, మరో ఆరుగురు ఇతర హిందూ సంస్థలకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ సారి ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారనీ, పార్కుల్లో తిరుగుతూ యువ జంటలను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులను అరెస్టు చేశామని గ్వాలియర్ ఎస్పీ యూకే సూర్యవంశి తెలిపారు.












Click it and Unblock the Notifications