సోనియా ఎందుకలా అన్నారు?

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వేర్పాటువాదులు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపును జమ్మూకాశ్మీర్ ప్రజలు ఖాతరు చేయలేదనీ...హింస, ఆందోళనల పట్ల విసుగు చెందిన ప్రజలు ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రగతి వైపునకు అడుగులు వేస్తున్నారని ఆమె ప్రశంసించారు. దీన్ని చూసి విచ్ఛినకర శక్తులు పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని సోనియా అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య మూలాలు ఎంత బలంగా ఉన్నాయో జమ్మూకాశ్మీర్ ప్రజలు నిరూపించారని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో బయటి వ్యక్తులు చేస్తున్న హింస ఇక ఎంతోకాలం కొనసాగదని సోనియా అన్నారు.












Click it and Unblock the Notifications