ముంబయి: పబ్‌లకు వెళ్లటం హిందూ సంస్కృతి కాదంటూ శ్రీరాంసేన వాటికి వెళ్లేవారిపై దాడులు చేస్తుంటే హిందూత్వను ప్రచారంచేస్తున్న భారతీయ జనతాపార్టీ అగ్రనేత సుష్మా స్వరాజ్ మాత్రం అందులో తప్పేం లేదని సమర్ధిస్తున్నారు. ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ యువతపై నమ్మకం ఉంచాలని వారిపై పోలీసుల్లా నిఘా వేయాల్సిన అవసరం ఈరోజుల్లో లేదని అన్నారు. పబ్‌లకు వెళ్లేవారిపై దాడులు చేయటాన్ని ఆమె తప్పు పట్టారు. లండన్‌లో ఉండే తన కూతురు కూడా పబ్‌లకు స్నేహితులతో వెళ్తుందని అయితే ఆమె ఆరెంజ్ జ్యూస్ తప్ప వైన్ తాగదని ఆమె అన్నారు.