మళ్ళీ మనమే వస్తాం: వైయస్

మరో ఐదేళ్లు కలిసి పనిచేద్దామని ఆయన కలెక్టర్లతో అన్నారు. రాబోయే ప్రభుత్వం మనదేనని, మళ్ళీ మనం ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామని, అందుకు కలెక్టర్ల సహకారం బాగుందని ఆయన అన్నారు. 2004 జూన్ 26, 27 తేదీల్లో మనం కాన్ఫరెన్స్ నిర్వహించామని, మళ్ళీ 2009 జూన్‌లో ఇలాగే సమావేశం జరుపుకుంటామని ఆయన కలెక్టర్లతో అన్నారు. ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్నందున ఈ రెండునెలలూ కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు.












Click it and Unblock the Notifications