మంత్రి రేణుకా చౌదరికి చిక్కులు

మంగళూరులో తాలిబనీకరణ సాగుతోందన్న రేణుక వ్యాఖ్యలు మంగళూరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ నగర మేయరు గణేష్ హొసబెట్టు, మరో 15 మంది దాఖలు చేసిన కేసు సరికొత్త మలుపుతిరిగింది. కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయాల్సిందిగా మంగళూరులోని మూడవ జె.ఎం.ఎఫ్.సి.న్యాయమూర్తి పోలీసుల్ని ఆదేశించారు. దర్యాప్తు నివేదికను మార్చి 20 లోగా సమర్పించాల్సిందిగా సూచించారు. ఆమెకు వ్యతిరేకంగా మంగళూరు కోర్టులో ఐపిసి 153ఎ, 153బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications