పూణే మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. కేతన్ దగ్గర కోటి రూపాయలు.. ప్రియుడికి ఇచ్చిన సియా
పూణే ఫోర్ట్ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు సియా కేతన్ అగర్వాల్ నుంచి పెళ్లి షాపింగ్ పేరుతో రూ. కోటి సేకరించి తన ప్రియుడు చేతన్‌కు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ డబ్బును వివాహ ఖర్చులకు ఉపయోగించకుండా చేతన్ ను ఆర్ధికంగా బలోపేతం చేయటం కోసం ఉపయోగించుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కేతన్ హత్యకు ముందే భవిష్యత్ ప్రణాళికలు
సియా-చేతన్ జంట కేతన్ ను ఎవరికీ తెలీకుండా గుట్టు చప్పుడు కాకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా హతమార్చి, ఆపై కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో కేతన్ హత్యకు ముందే భవిష్యత్ ప్రణాళికలు వేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కేతన్‌ను హతమార్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

పక్కా ప్లాన్ తోనే కేతన్ హత్య
తమపై అనుమానం రాకుండా చూసుకోవడం కోసం ఈ ప్లాన్‌ను అమలు చెయ్యాలని అన్నీ పక్కా ప్లాన్ గానే చేశారని పోలీసులు అంటున్నారు. సియా తన కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో చేతన్‌ను ఆర్ధికంగా సెటిల్ చేయాలని భావించింది. తను ఆర్ధికంగా సెటిల్ కావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని చేతన్ చెప్పిన నేపథ్యంలో కేతన్ నుంచి డబ్బు తీసుకొని ప్రియుడికి అందజేసినట్లు తెలుస్తోంది.
కేతన్ హత్య వెనుక ఆర్థిక కారణాలు, ప్రేమ వ్యవహారాలు, ప్లాన్‌లు
ఈ డబ్బు వివాహ ఖర్చులకు బదులు చేతన్ ను ఆర్ధికంగా స్ట్రాంగ్ చేయటం కోసం సియా ఇచ్చినట్టు తెలుస్తుంది. పుణె పోలీసులు ఈ కేసును అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ హత్య వెనుక ఆర్థిక కారణాలు, ప్రేమ వ్యవహారాలు, ప్లాన్‌లు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలతో తెలుస్తుంది. సియా-చేతన్ జంట మధ్య దీర్ఘకాలిక సంబంధం ఉన్నట్లు, దానిని కొనసాగించడానికి కేతన్‌ను అడ్డు తొలగించుకున్నట్లు దర్యాప్తు సూచిస్తోంది.
హత్య వెనుక ఉన్న పూర్తి కుట్ర బయట పెట్టేలా పోలీసుల దర్యాప్తు
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు వెల్లడవడం ద్వారా హత్య వెనుక ఉన్న పూర్తి కుట్ర బయటపడనుంది. ఏది ఏమైనా దేశం మొత్తాన్ని ఈ తాజా క్రైం షాక్ కు గురి చేసింది. సియా, లవర్ కోసం చేసిన పని













Click it and Unblock the Notifications