సినీ నటి నిర్మలమ్మ కన్నుమూత

నిర్మలమ్మ అమ్మ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. ఆమె వేయికి పైగా చిత్రాల్లో నటించారు. అందురు హీరోలు, హీరోయిన్లు నటించిన చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టరుగా నటించారు. ఆమె మొదటి సినిమా గరుడ భంగం కాగా చివరి సినిమా ప్రేమకు స్వాగతం. ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. మొదట్లో ఆమె నాటకాల్లో నటించారు. ఆమె నాటకాల్లో నటనకు విశేష ఆదరణ లభించింది.
నిర్మలమ్మ మృతితో సినిమా రంగం పెద్ద దిక్కు కోల్పోయిందని ప్రజారాజ్యం అధినేత, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. నిర్మలమ్మతో తనకు గల అనుబంధాన్ని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నెమరేసుకున్నారు. తమది దాదాపు 40 ఏళ్ల పరిచయమని ఆయన అన్నారు. మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఆమె మృతికి సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications