వైయస్ మాఫియా: చంద్రబాబు

కాంగ్రెసు పార్టీకి వైయస్ నిధులు సమకూరుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులున్నారని, దీంతో వైయస్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని ఆయన అన్నారు. వైయస్ ఆర్థిక నేరాలను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తెస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెస్తున్నామని ఆయన చెప్పారు. వైయస్ ను, ఇతరులను ప్రాసిక్యూట్ చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. కేవలం తాము ఆరోపణలు చేయడం లేదని, వైయస్ నేరాలకు సాక్ష్యాలున్నాయని ఆయన అన్నారు. దానిపై ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. వైయస్ పై చర్యకు యుపిఎలోని కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏచూరి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications