ఆ రెండు పార్టీలూ దండగే: చిరు

Chiranjeevi
కర్నూలు‌: తెలుగుదేశం, కాంగ్రెసుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు మేలు చేయబోవని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం ఆయన ప్రజా అంకిత యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్పు రాబోదని, తమ ప్రజారాజ్యం పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యమని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు. కార్పోరేట్ సంస్థలకు నిధులు సమకూర్చి పెట్టడానికే ఆరోగ్యశ్రీ పథకం పనికి వస్తోందని, పేదలకు మేలైన వైద్యం అందడం లేదని ఆయన విమర్శించారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, రైతు కడుపు నింపడానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, జాతికి అన్నం పెడుతున్న రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యుత్తు అందించకపోవడం వల్ల రైతుల మరణాలు సంభవిస్తున్నాయని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+