హైదరాబాద్: తన సతీమణి సురేఖతో కలిసి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శుక్రవారం ఉదయం వివాహ దినోత్సవాన్ని జరుపుకున్నారు. భార్యతో కలిసి ఆయన కర్నూలు జిల్లా వెలిగొండలో కేక్ కట్ చేశారు. దీని కోసం సురేఖతో పాటు ఆమె సోదరుడు అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులు ఉదయమే వెలిగొండకు చేరుకున్నారు.
చిరంజీవి ప్రముఖ హాస్య నటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980 ఫిబ్రవరి 20వ తేదీన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకల వల్ల కర్నూలు జిల్లాలో ఆయన ప్రజా అంకిత యాత్ర శుక్రవారం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.