మాజీ మంత్రి సుఖ్ రామ్ దోషి
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్‌ను ఢిల్లీ కోర్టు దోషిగానిర్థారించింది. ఆయన అక్రమాస్తులపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 1991నుంచి 1996 మధ్య సుఖ్‌రాం ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు కౌశాంబి, ఘజియాబాద్‌లలో హిమాచల్‌ప్రదేశ్‌లలో అనేక ఇళ్లు, ఫాంహౌస్‌లు అక్రమంగా సంపాదించారని సీబీఐ అధికారులు ఆరోపణలు చేశారు. 4.25 కోట్ల అక్రమాస్తుల కేసులో కోర్టు శుక్రవారం ఆయనను దోషిగా నిర్ధారిస్తూ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈనెల 24న ఆయనకు శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనకు ఎక్కువలో ఎక్కువగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. కోర్టు నిర్ణయం వెలువడే సమయంలో ఆయన అక్కడ లేరు. రోహిని జిల్లా కోర్టులో పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుకు హాజరు కావడానికి వెళ్లారు. సుఖ్ రామ్ పివి నర్సింహారావు మంత్రివర్గంలో కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా పని చేశారు.












Click it and Unblock the Notifications