బాబు బాగోతాలు తెలుసు: వైయస్

YS Rajasekhar Reddy
విజయనగరం: తనపై, తన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రబాబు బాగోతాలు అందరికీ తెలుసునని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్ షో కూడా నిర్వహించారు. చంద్రబాబు వామపక్షాలతో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న తెరాసతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఎలా కాపాడగలరని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో అమలైన కార్యక్రమాలతో, తమ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల కాలంలో అమలు చేసిన కార్యక్రమాలతో బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై కూడా ఆయన విమర్శలు చేశారు. సినిమాల్లో కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన చిరంజీవి సొంత గ్రామం కోసం ఒక్క పైస కూడా ఖర్చు చేయలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+