హైదరాబాద్: సత్యం కేసు విచారణను చేపట్టిన సీబీఐ అధికారుల బృందం ఈరోజు డీజీపీ కార్యాలయానికి వచ్చింది. సీబీఐ డిఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని 16మంది సభ్యుల బృందం అక్కడ సీఐడీ అధికారులతో చర్చలు జరుపుతోంది. సీఐడీ అధికారులు తాము సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించినట్లు తెలుస్తోంది. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను, హార్డ్‌డిస్క్‌లను సీఐడీ అధికారులు వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. తమ విచారణలో సహకరించాలని, తమకు అవసరమైన సిబ్బందిని వాహనాలను సమకూర్చాలని సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించడం అందుకు ప్రభుత్వం అంగీకరించడం తెలిసిందే.