హైదరాబాద్: మాతృభాష దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం సచివాలయం ముందు ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రభుత్వం తరపున కార్యక్రమం నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి భాషా రక్షణపై మాట్లాడారు. మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తెలుగుభాషకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.