మంగుళూరు: కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మంగుళూరులోని ఓ పబ్‌లో శ్రీరామ్‌సేన కార్యకర్తలు మహిళలపై దాడి చేయటాన్ని తప్పుబట్టిన సందర్భంగా ఆమె మంగుళూరును తాలిబన్ల స్థావరంలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పోలిక తమ పట్టణాన్ని కించపరిచేదిగా ఉందంటూ మంగుళూరు మేయరు గణేష్ క్రిమినల్ కేసు పెట్టారు. కోర్టులో ఈకేసు విచారణ మంగళవారం జరగనుండగా ఈరోజు మంగుళూరు పోలీసులు రేణుకా చౌదరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.