ఆంధ్రజ్యోతి, ఈనాడు..టీడీపీకే: వైఎస్

సైన్స్ సిటీ ఏర్పాటైతే అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది లబ్ధి పొందే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఏర్పాటయ్యే సైన్స్ సిటీకి అవసరయ్యే మంచి నీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కడప జిల్లా సోమశిల నుంచి రెండు శతకోటి ఘనపుటడుగులు నీటిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎకరా 50వేల రూపాయలు పలుకుతున్న భూములకు లక్షా 50 వేల రూపాయలు చెల్లించి సైన్స్ సిటీ కోసం కొనుగోలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుతగులుతున్నారన్నారు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తుంటే వీరు మాత్రం లేనిపోని ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications