కుప్పకూలిన ప్రజారాజ్యం వేదిక
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో పీఆర్పీ బహిరంగసభ వేదిక కుప్పకూలటంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాతో సహా నాయకులంతా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పరిటాల నుంచి అనాసాగరం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు అక్కడికి సభావేదిక వద్దకు చేరుకోకముందే స్థానిక నేతలంతా వేదికమీదకు చేరుకున్నారు. ఏడుగురు మాత్రమే వేదికపై ఉండాలని నిర్వాహకులు చెప్పినా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేదిక మీదకు చేరటంతో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా పరుగుపెట్టారు. అయితే వేదిక తక్కువ ఎత్తులోనే ఉండటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతరం రాధా తన వాహనంపై నిలబడి ప్రసంగించారు.












Click it and Unblock the Notifications