హైదరాబాద్: సిఎల్ పి మాజీ నాయకుడు, నగర కాంగ్రెస్ ప్రముఖ నేత దివంగత పి. జనార్ధన రెడ్డి కుటుంబ సభ్యులు నేడు ముఖ్యమంత్రి వైఎస్సార్ ను కలిశారు. పీజేఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తమ కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కుటుంబసభ్యులు కోరారు. పీజేఆర్ భార్య సులోచనమ్మ, కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి, కూతురు విజయారెడ్డి ఈరోజు సీఎంను, పీసీసీ చీఫ్ డీఎస్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌నుంచి విష్ణుకు, ఖైరతాబాద్ నుంచి విజయకు టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరారు.